ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియాగాంధీతో ఫోనులో మాట్లాడిన లాలూ

ABN, First Publish Date - 2021-10-27T20:49:43+05:30

బీహార్‌లోని విపక్ష మహా కూటమిలో చిక్కులు తలెత్తిన నేపథ్యంలో రాష్ట్రీయ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీహార్‌లోని విపక్ష మహా కూటమిలో చిక్కులు తలెత్తిన నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఫోనులో మాట్లాడారు. అయితే, ఇద్దరి మధ్య  సంభాషణల వివరాలు మాత్రం వెల్లడి రాలేదు. అక్టోబర్ 30న కుషేశ్వర్ ఆస్థాన్ (ఎస్‌సీ), తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మధ్య తెగతెంపులు చోటుచేసుకున్నాయి.


దీనికి ముందు, బీహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తే ఆర్జేడీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లాలూ పేర్కొన్నారు. అయితే, తాజాగా దీనిపై ఆయన మరింత వివరణ ఇస్తూ, జాతీయ స్థాయి రాజకీయాల్లో బీజేపీకి బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని, తమ పార్టీ ఎప్పుడూ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. 2020 బీహార్ ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలుగా ఆర్జేడీ, కాంగ్రెస్ పోటీ చేశాయి. మెజారిటీకి 10 స్థానాలు తక్కువగా కూటమికి సీట్లు వచ్చాయి. ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిపించింది. కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో గెలుపొందింది. అధికార ఎన్డీయే 125 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. బీజేపీ 74, జనతాదళ్ (యునైటెడ్) 43, ఎన్డీయే ఇతర భాగస్వామ్య పార్టీలు 8 సీట్లు సాధించాయి.

Updated Date - 2021-10-27T20:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising