ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid Crisis పై ప్రధాని మోదీకి సోనియా సూచన

ABN, First Publish Date - 2021-05-07T21:11:56+05:30

దేశంలో రోజుకు నాలుగు లక్షలు దాటి కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే 3,900 మంది ఒకే రోజు మరణించారు. కానీ ప్రభుత్వ చర్యలు సరిగా లేవు. ఆక్సీజన్, మందులు, వెంటిలేటర్లు, బెడ్లు అన్నింటి కొరత ఉంది. వీటిని అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. సిస్టం సరిగానే ఉంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ సూచించారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు కలిసి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకుంటే ఆశాజనక ఫలితాలు వస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభలో సభ్యత్వం ఉన్న కాంగ్రెస్ నేతలు(ఎంపీలు) హాజరయ్యారు.


‘‘దేశంలో రోజుకు నాలుగు లక్షలు దాటి కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే 3,900 మంది ఒకే రోజు మరణించారు. కానీ ప్రభుత్వ చర్యలు సరిగా లేవు. ఆక్సీజన్, మందులు, వెంటిలేటర్లు, బెడ్లు అన్నింటి కొరత ఉంది. వీటిని అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. సిస్టం సరిగానే ఉంది. కానీ ఆ సిస్టంకు వనరులు అందించి పనితీరును మెరుగుపర్చడంలోనే మోదీ విఫలమయ్యారు. ప్రస్తుత నాయకత్వం దేశాన్ని కుంటుపరిచింది. టీకా కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇందులో కోట్ల మంది దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులతో పాటు అట్టడుగున ఉన్నవారిని మినహాయించారు. ప్రజల పట్ల ప్రాథమిక బాధ్యతలు విధుల నుంచి మోదీ ప్రభుత్వం తప్పుకుంది. నేషనల్ టాస్క్‌ఫోర్స్, పార్లమెంటరీ ప్యానెల్‌ల నుంచి వచ్చిన హెచ్చరికలను గాలికి వదిలేశారు’’ అని సోనియా గాంధీ అన్నారు.

Updated Date - 2021-05-07T21:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising