ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jaishankar బ్రిటన్ పర్యటనలో మార్పులు

ABN, First Publish Date - 2021-05-05T23:07:26+05:30

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రిటన్ పర్యటనలో స్వల్ప మార్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రిటన్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయన నేతృత్వంలోని బృందంలో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్ అని మంగళవారం నిర్ధరణ కావడంతో మిగిలిన సమావేశాలను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైశంకర్ బుధవారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 


‘‘కోవిడ్-19 పాజిటివ్ కేసుల గురించి నిన్న (మంగళవారం) సాయంత్రం తనకు చెప్పారు. పరిపూర్ణ ముందు జాగ్రత్త చర్యగా, ఇతరుల గురించి ఆలోచించడంలో భాగంగా, నేను మిగిలిన సమావేశాలను వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తాను. జీ7 సదస్సు విషయంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది’’ అని జైశంకర్ పేర్కొన్నారు. 


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జైశంకర్ నేతృత్వంలోని బృందంలో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్ అని మంగళవారం నిర్థరణ అయింది. మరికొన్ని పరీక్షల నివేదికలు రావలసి ఉంది. 


జైశంకర్ బృందం నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం లండన్ చేరుకుంది. జీ7 విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశంలో అతిథిగా పాల్గొనాలని జైశంకర్‌ను బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ ఆహ్వానించారు. రాబ్‌తో గురువారం జరగవలసిన సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2021-05-05T23:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising