ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాముల ‘డాక్టర్’...!

ABN, First Publish Date - 2021-06-19T18:44:34+05:30

అతను కాబోయే డాక్టర్‌. ఓ వైద్య విద్యార్థి... బళ్ళారిలోని విజయనగర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(విమ్స్‌)కళాశాలలో హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్న అశోక్‌ నగరంలోని ఇంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్ళారి గాంధీనగర్(కర్ణాటఖ): 


ఎవరీ డాక్టర్‌..

అతను కాబోయే డాక్టర్‌. ఓ వైద్య విద్యార్థి... బళ్ళారిలోని విజయనగర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(విమ్స్‌)కళాశాలలో హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్న అశోక్‌ నగరంలోని ఇందిరానగర్‌ నివాసి. 


ఎక్కడెక్కడ పడతారు..

నగరంలో ఎవరు పాము ఉందని ఫోన్‌ చేసినా... వెంటనే ఆ ప్రాంతంలో వాలిపోయి ఎంతపెద్ద విష సర్పమైనా ఇట్టే పట్టేసి  మనవ సంచారం లేని సుదూర ప్రాంతాల్లోకి వదిలేస్తూ.... పాముల పరిరక్షణలో తన వంతు బాధ్యత వహిస్తున్నాడు. విమ్స్‌ కళాశాల చుట్టూ ఎత్తైన చెట్లతో పాటు పొదలు ఎక్కువగా ఉండడంతో రోజూ పాములు కనిపించినా టక్కున పట్టేస్తాడు.


పాములు పట్టడం ఎలా నేర్చుకున్నారు..?

చిన్నప్పటి నుంచి పాములు అంటే ఆమడ దూరం పరిగేత్తే అశోక్‌... నేడు ఎంత పెద్ద పామునైనా సరే ఇట్టే పట్టేసే నైపుణ్యం పొందాడు.. మొదట్లో పాములు అంతే ఎంతో భయం ఉండేదని, అయితే పాములు పట్టుకోవడం నేర్చుకోవాలన్న అభిలాషతో... తాను వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే ఓ లెక్చరర్‌ తనలో దైర్యం నింపి ఎలాంటి పాము ఎలా పట్టుకోవాలని... పాములు ఎలాంటి సందర్భంలో మనుషులపై దాడులు చేస్తాయి.. పాములు ఎన్నిరకాలు అన్న విషయంపై అవగాహన కల్పించారన్నారు. పాములపై సమగ్ర అధ్యయనం చేసిన అశోక్‌ ప్రస్తుతం నగరంలో పాములు పట్టేవారి అగ్ర జాబితాలో చేరిపోయారు. కనిపించిన ప్రతి పామును పడుతూ స్నేక్‌ సంతో్‌షగా నగరంలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి దాకా వెయ్యికి పైగా పాములు పట్టుకోవడం మామూలు విషయం కాదు మరి..!


ఇప్పుడేం జరిగింది..

అశోక్‌ చేతిలో కనిపిస్తున్న పాము శుక్రవారం నగరంలో కప్పగల్లు రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిలో సుమారు 5.5 అడుగుల నాగుపాము, మరో 3.5 అడుగుల నాగుపామును మింగేసింది. ఓ ప్లాస్టిక్‌ పైప్‌ లో దాక్కున్న పెద్ద నాగుపామును పట్టుకునే సమయంలో పెద్ద పాము చిన్నపామును కక్కడం స్థానిక ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. 


ఫోన్‌ కొట్టు..పాము పట్టు

నగర ప్రజలు ఎవరికైనా.. ఎక్కడైనా పాములు కనిపిస్తే ఎవరూ భయపడరాదని, వెంటనే 9110896181 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే వచ్చి ఎలాంటి పామునైనా పట్టేసుకుంటానని అశోక్‌ ఆంధ్రజ్యోతితో తెలిపారు. ఎం తైనా ఆపడలో ఆపద్భాందవుడీ అశోక్‌..!

Updated Date - 2021-06-19T18:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising