ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాంగ్‌స్టర్ మృతదేహాన్ని దహనం చేసేందుకు కుటుంబసభ్యుల నిరాకరణ

ABN, First Publish Date - 2021-06-14T12:59:06+05:30

గ్యాంగ్‌స్టర్ మృతదేహాన్ని దహనం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు నిరాకరించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరోజ్‌పూర్: గ్యాంగ్‌స్టర్ మృతదేహాన్ని దహనం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు నిరాకరించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. కోల్‌కతాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ లో గ్యాంగ్‌స్టర్ జైపాల్ సింగ్ భుల్లార్ మృతి చెందారు. గ్యాంగ్‌స్టర్ జైపాల్ మృతదేహాన్ని అతని కుటుంబం ఆదివారం దహనం చేయడానికి నిరాకరించింది. ఎన్‌కౌంటర్ చేయడానికి ముందే జైపాల్ ను దారుణంగా కొట్టారని, అతని మృతదేహానికి మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని భుల్లార్ కుటుంబం కోరింది.లూధియానాలో ఇటీవల ఇద్దరు పోలీసులను హత్య చేసిన భుల్లార్, మరో గ్యాంగ్‌స్టర్ జస్ప్రీత్ సింగ్ లు కోల్‌కతాలో జూన్ 9 న జరిగిన కాల్పుల్లో మరణించారు.


కోల్‌కతా నగరంలోని న్యూ టౌన్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో గ్యాంగ్‌స్టర్ల అజ్ఞాతవాసం గురించి పంజాబ్ పోలీసులకు సమాచారం అందడంతో కోల్‌కతా పోలీసు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసింది. భుల్లార్ మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు సెంట్రల్ జైలు నుంచి అతని తమ్ముడు అమృత్ పాల్ సింగ్ ను తీసుకువచ్చినా, దహన సంస్కారాలు చేసేందుకు మృతుడి కుటుంబసభ్యులు నిరాకరించారు. తమ కుమారుడైన భుల్లార్ మృతదేహంపై గాయాల గుర్తులున్నాయని అతని తండ్రి భూపిందర్ సింగ్ ఆరోపించారు. తన కుమారుడిని ఎన్ కౌంటరుకు ముందు దారుణంగా కొట్టారని తండ్రి చెప్పారు. తన కుమారుడి మృతదేహానికి రీ పోస్టుమార్టం జరిపించాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్ గుర్పాల్ సింగ్ కు దరఖాస్తు చేశారు. 

Updated Date - 2021-06-14T12:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising