ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ పార్టీ ఏర్పాటుపై రైతు సంఘాల యూటర్న్!

ABN, First Publish Date - 2021-12-26T02:41:19+05:30

వాస్తవానికి శనివారం మధ్యాహ్నం కొన్ని రైతు సంఘాల నేతలు పార్టీ ప్రకటన చేశారు. సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్టీ నుంచి రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగననున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రకటన గురించి శనివారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతు సంఘాలు తాజాగా రాజకీయ పార్టీని ప్రకటించాయి. సంయుక్త కిసాన్ మోర్చాలో చర్చల అనంతరం 22 రైతు సంఘాలతో కలిసి పార్టీని ఏర్పాటు చేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈ రాజకీయ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించడం గమనార్హం. సంయుక్తి కిసాన్ మోర్చాలో 40కి పైగా రైతు సంఘాలు ఉన్నాయి. అందులో సగానికి పైగా సంఘాలు రాజకీయ పార్టీలో ఉన్నట్లు శనివారం మద్యాహ్నం ప్రకటన వచ్చింది. అయితే సాయంత్రం తిరిగే లోపు సంయుక్త కిసాన్ మోర్చా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ప్రకటన రావడం విశేషం.


వాస్తవానికి శనివారం మధ్యాహ్నం కొన్ని రైతు సంఘాల నేతలు పార్టీ ప్రకటన చేశారు. సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్టీ నుంచి రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగననున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రకటన గురించి శనివారం చండీగఢ్‌లో రైతు సంఘం సీనియర్ నేత బల్బిర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ ‘‘400 భిన్న ఆలోచనా విధానాలున్న సంఘాలు అన్నీ కలిసి ‘సంయుక్త  సమాజ్ మోర్చా’ అనే పార్టీని ఏర్పాటు చేశాయి. రైతుల సమస్యలే ప్రధానంగా ఈ పార్టీ ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపు మా నుంచి ఎప్పుడూ లేదు. అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ గురించి ఇంకా పూర్తి అవగాహనకు రాలేదు. కానీ వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2021-12-26T02:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising