ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు మాసాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు

ABN, First Publish Date - 2021-07-07T16:02:54+05:30

పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగటంతో ప్రభుత్వ రవాణా సంస్థ ఎలక్ర్టిక్‌ బస్సుసర్వీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి రాజకన్నప్పన్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

            - మంత్రి రాజకన్నప్పన్‌ వెల్లడి


చెన్నై: పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగటంతో ప్రభుత్వ రవాణా సంస్థ ఎలక్ర్టిక్‌ బస్సుసర్వీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి రాజకన్నప్పన్‌ ప్రకటించారు. ఆరు నెలల్లోనే రాష్ట్రంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని, ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేస్తూ డీజిల్‌ ధరలు పెరగటంతో ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపే విషయంపై దృష్టిసారించినట్టు తెలిపారు. తొలుత ఎలక్ర్టికల్‌ బస్సులు నడిపేందుకు అనువుగా తగు మౌళిక సదుపాయాలు కల్పించనున్నామని చెప్పారు. డీజిల్‌తో నడిచే బస్సుల ధరకంటే విద్యుత్‌తో నడిచే బస్సుల ధర ఐదింతలు అధికమని, అయినా రవాణ సంస్థలో నష్టాలను నివారించే దిశగా విద్యుత్‌ బస్సులను నడుపుతామని ఆయన వివరించారు.


17,600 బస్సులు

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి 17,600 బస్సులను నడుపుతున్నట్టు మంత్రి రాజకన్నప్పన్‌ తెలిపారు. రవాణా సంస్థలో 19 వేలకు పైగా బస్సులు ఉన్నాయని, వీటిలో 2100 బస్సులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవని తెలిపారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడపటం లేదని తెలిపారు. తాజా సడలింపుల లాక్‌డౌన్‌ ప్రకారం అన్ని జిల్లాల్లో అవసరమైనంతగా బస్సులను నడుపుతామని, ఇక మహిళలు, దివ్యాంగులు, హిజ్రాలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా 7291 వైట్‌బోర్డ్‌ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. చెన్నై నగర రవాణా సంస్థ ఆధ్వర్యంలో రోజూ 1550 సిటీ సర్వీసు బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఉత్తర్వు మేరకు రవాణా సంస్థ బస్సులలో తిరువళ్లువర్‌ చిత్రపటంతో తిరుక్కురళ్‌ సూక్తి, తాత్పర్యంతో కూడిన బోర్డులను పది రోజులలో ఏర్పాటు చేయనున్నట్టు రాజకన్నప్పన్‌ తెలిపారు.

Updated Date - 2021-07-07T16:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising