ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగాలాండ్ ఎన్‌కౌంటర్: జవాన్లను ప్రశ్నించనున్న సిట్

ABN, First Publish Date - 2021-12-30T00:28:03+05:30

స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ అనే గ్రామంలో డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూలీలతో వెళ్తున్న వాహనంపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో 13 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోంది. కాగా, గురువారం జవాన్లను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మోన్‌‌లో జరిగిన ఈ ఘటనలో 21వ పారా స్పెషల్ ఫోర్స్‌కి చెందిన 30 జవాన్ల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆర్మీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.


స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మోన్ జిల్లాలోని ఓటింగ్-టిరు గ్రామాల మధ్యలో ఈ ఆపరేషన్ జరుగుతుండగా, రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అయితే అందులో ఉన్న ఉగ్రవాదులే అని అనుమానంతో సైనికులు కాల్పులు జరిపారని మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-12-30T00:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising