ప్రధాని ప్రధాన సలహాదారు సిన్హా రాజీనామా
ABN, First Publish Date - 2021-03-17T07:37:24+05:30
ప్రధాని మోదీ ప్రధాన సలహాదారు పీ.కే.సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
న్యూఢిల్లీ, మార్చి 16: ప్రధాని మోదీ ప్రధాన సలహాదారు పీ.కే.సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2019 ఆగస్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమితులైన ఆయన.. కొద్ది రోజుల్లోనే సెప్టెంబరులో ప్రధాని ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. మోదీ పదవిలో ఉన్నంతకాలం లేదా తదుపరి ఉత్తర్వుల వరకూ విధుల్లో కొనసాగుతారని సిన్హా నియామక పత్రంలో పేర్కొనడం గమనార్హం.
Updated Date - 2021-03-17T07:37:24+05:30 IST