ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిలిగురి-ఢాకా రైలు సర్వీసు మార్చి26న ప్రారంభం

ABN, First Publish Date - 2021-02-25T13:41:16+05:30

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మార్చి 26వతేదీ నుంచి సిలిగురి జిల్లా న్యూజల్పాయ్‌గురి నుంచి బంగ్లాదేశ్ లోని ఢాకా రైల్వేస్టేషన్ వరకు మూడో ప్యాసింజరు రైలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిలిగురి (పశ్చిమబెంగాల్): బంగ్లాదేశ్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మార్చి 26వతేదీ నుంచి సిలిగురి జిల్లా న్యూజల్పాయ్‌గురి నుంచి బంగ్లాదేశ్ లోని ఢాకా రైల్వేస్టేషన్ వరకు మూడో ప్యాసింజరు రైలు నడపాలని భారత్, బంగ్లాదేశ్‌లు నిర్ణయించాయి. భారత్, బంగ్లాదేశ్‌ ల మధ్య ఇప్పటికే మైత్రీ ఎక్స్‌ప్రెస్, బంధన్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి.వచ్చే నెల 26వతేదీన భారత్, బంగ్లాదేశ్‌ ల ప్రధానమంత్రులు న్యూజల్పాయ్‌గురి నుంచి బంగ్లాదేశ్ లోని ఢాకా వరకు ప్యాసింజరు రైలును ప్రారంభిస్తారని రైల్వే అధికారులు చెప్పారు.


బంగ్లాదేశ్ రైల్వే డీఆర్ఎం ముహమ్మద్ షాహిదుల్ ఇస్లాం నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం ఫిబ్రవరి 21వతేదీన సిలిగురికి వచ్చి భారత రైల్వే డీఆర్ఎం రబీందర్ కుమార్ వర్మతో కలిసి చర్చించారు. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య మూడో రైలును ప్రారంభించాలని నిర్ణయించారు.పది బోగీలతో కూడిన బై వీక్లీ ట్రైన్ సర్వీసు న్యూజల్పాయ్ గురి నుంచి ఢాకాకు నడుపుతామని డీఆర్ఎం రబీందర్ కుమార్ చెప్పారు.ఈ రైలు సర్వీసుతో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మైత్రీబందం మరింత బలోపేతం కానుంది.

Updated Date - 2021-02-25T13:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising