ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి!

ABN, First Publish Date - 2021-06-11T02:19:00+05:30

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య తలెత్తిన విభేదాలకు కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య తలెత్తిన విభేదాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ మార్గం చూపారు. ఈ వివాదాన్ని ‘డిప్యూటీ సీఎం’ పదవితో పుల్‌స్టాప్ పెట్టాలని సోనియా గాంధీ భావించారు. నవజ్యోత్ సింగ్ సిద్దూకు డిప్యూటీ సీఎం పదవిని అధిష్ఠానం ఇవ్వనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్దూను తాము పక్కన పెట్టమని, ఆయన సేవలు వినియోగించుకుంటామని అధిష్ఠానం పెద్దలు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కుదరని పక్షంలో ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వాలని సోనియా గాంధీ డిసైడ్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం అమరీందర్ సింగే ఉంటారని అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వాన్ని బలపరిచారని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికలో పేర్కొంది.  మరోవైపు సీఎం అమరీందర్, సిద్దూ మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ రిపోర్టును ఈ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారు. 

Updated Date - 2021-06-11T02:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising