ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్ను వ్యతిరేంచిన వారి వల్లే ఎదిగా: సిద్ధూ

ABN, First Publish Date - 2021-07-23T23:36:14+05:30

తనను వ్యతిరేకించిన వారు ఒక రకంగా తన ఎదుగుదలకు దోహదపడ్డారని కాంగ్రెస్ పంజాబ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛండీగఢ్: తనను వ్యతిరేకించిన వారు ఒక రకంగా తన ఎదుగుదలకు దోహదపడ్డారని కాంగ్రెస్ పంజాబ్ విభాగం అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పార్టీ పంజాబ్ యూనిట్ అధ్యక్షుడుగా సిద్ధూ శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా కనిపించడంతో వీరిరువురి మధ్య సయోధ్య కుదిరిందనే అభిప్రాయానికి తావిచ్చింది. వారి ప్రసంగాలు సైతం అందుకు అనుగుణంగానే సాగాయి.


పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సిద్ధూ మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో భుజం భుజం కలిపి తాను పనిచేస్తానని చెప్పారు. తనకు ఎలాంటి ఇగోలు లేవని చెప్పారు. ''విపక్షాలు ఏవైతే చెబుతున్నాయో దానికి భిన్నంగా కాంగ్రెస్ ఈరోజు కలిసికట్టుగా, ఐక్యంగా ఉంది'' అని ఆయన అన్నారు. అన్యాపదేశంగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నిక కావడానికి జరిగిన పరిణామాలపై మాట్లాడుతూ, తనను వ్యతిరేకించిన వారే తన ఎదుగుదలకు దోహదపడ్డారని వ్యాఖ్యానించారు. దీనికి ముందు, పంజాబ్‌ భవన్‌లో 'టీ పార్టీ'కి అమరీందర్ సింగ్ హాజరయ్యారు. సిద్ధూ, అమరీందర్ సింగ్ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. పదవీ బాధ్యతలు చేపడుతున్నందున తప్పనిసరిగా రావాలంటూ మంగళవారంనాడు సీఎం నివాసానికి సిద్ధూ స్వయంగా వెళ్లి ఆయనను ఆహ్వానించారు.

Updated Date - 2021-07-23T23:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising