ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరుపై సిద్ధూ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-11-11T22:23:44+05:30

గురువారం చండీగఢ్‌లో సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ‘‘చట్ట సభల్లో చర్చలు జరగాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ పంజాబ్ అసెంబ్లీలో అలా జరగడం లేదు. ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షం భయపడుతోంది. అందుకే సభను అడ్డుకుంటోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ చర్చలు జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుపడడంపై పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు భయంతోనే సభను అడ్డుకుంటున్నాయని, ప్రభుత్వం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ నిర్ణయాలపై సిద్ధూ ప్రశంసలు కురిపించారు. చన్నీ ప్రభుత్వ నిర్ణయాలు తాత్కాలిక ఉపశమనం కాదని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని సిద్ధూ అన్నారు.


గురువారం చండీగఢ్‌లో సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ‘‘చట్ట సభల్లో చర్చలు జరగాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ పంజాబ్ అసెంబ్లీలో అలా జరగడం లేదు. ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షం భయపడుతోంది. అందుకే సభను అడ్డుకుంటోంది. చన్నీ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వానికి 5 ఏళ్లకు సరిపడా విజన్ ఉంది. అవేవో 2-3 నెలలకు సంబంధించినవి కావు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించడం లేదు’’ అని అన్నారు.

Updated Date - 2021-11-11T22:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising