ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SC: కొవిడ్ మృతులకు ₹50,000 ఇవ్వాల్సిందే

ABN, First Publish Date - 2021-10-04T21:24:21+05:30

కొవిడ్-19తో మరణించిన కుటుంబాలకు పరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన 50,000 రూపాయలను చెల్లించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్-19తో మరణించిన కుటుంబాలకు పరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన 50,000 రూపాయలను చెల్లించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19తో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఉన్నా లేకపోయినా ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం మాత్రం అందించాల్సిందేనని, ఏ రాష్ట్రం కూడా దీనిని నిరాకరించరాదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయితే కొందరి మరణ ధ్రువీకరణ పత్రాల్లో కొవిడ్-19తో చనిపోలేదని పేర్కొనడం వంటి కారణాలను సాకుగా చూపి తప్పించుకోరాదని సుప్రీం హెచ్చరించింది. మరణ ధ్రువీకరణ పత్రం అప్పటికే జారీ అయితే మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం వద్దకు వెళ్లొచ్చని పేర్కొంది. ఈ పథకానికి సంబంధించి మీడియా ఇతర వేదికల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Updated Date - 2021-10-04T21:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising