ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమాచల్‌లో ప్రకృతి విపత్తులకు 213 మంది బలి... రూ. 623 కోట్ల ఆస్తి నష్టం!

ABN, First Publish Date - 2021-08-02T13:26:06+05:30

హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ ఏడాది అననుకూల వాతావరణంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ ఏడాది అననుకూల వాతావరణంలో పలు ప్రకృతి విపత్తులు సంభవించాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ తెలిపిన వివరాల ప్రకారం ఈ వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వివిధ ఘటనల్లో 213 మంది మృత్యువాత పడ్డారు. మరో 12 మంది జాడ తెలియడం లేదు. అలాగే రూ. 623 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. 


ఈ వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా 110 మంది మృతి చెందారు. కొండచెరియలు విరిగిపడి 21 మంది, వరదలు తదితర కారణాలతో 9 మంది, నదులలో మునిగి 19 మంది, ఇలాంటి వివిధ ప్రకృతి విపత్తుల కారణంగా మరో 27 మంది మృతి చెందారు. కాగా గడచిన 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-08-02T13:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising