ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హఠాత్తుగా యూటర్న్ తీసుకున్న టీఎంసీ ఎంపీ శతాబ్ది

ABN, First Publish Date - 2021-01-16T03:23:32+05:30

టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. శనివారం తాను ఢిల్లీ వెళ్లడం లేదని ఆమె శుక్రవారం రాత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. శనివారం తాను ఢిల్లీ వెళ్లడం లేదని ఆమె శుక్రవారం రాత్రి మీడియాతో ప్రకటించారు. తృణమూల్‌లోనే ఉన్నానని, ఇకపై తృణమూల్‌తోనే ఉంటానని ఆమె ప్రకటించారు. తాను ఎంపీ అభిషేక్ బెనర్జీతో పూర్తిగా చర్చించానని, తన వాదనలను ఆయన సావధానంగా ఆలకించారని ఆమె వెల్లడించారు. ‘‘శనివారం నేను ఢిల్లీ వెళ్లడం లేదు. టీఎంసీలోనే ఉంటాను.’’ అని ఆమె ప్రకటించారు. పార్టీలో అసంతృప్తి ఉన్నవారందరూ తమ సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని, పది మంది ఒక్కసారిగా సమస్యలను లేవనెత్తినా పార్టీ వాటిని పరిష్కరించాలి అని శతాబ్ది రాయ్ అన్నారు.


 శనివారం తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతానని  అంతకు పూర్వం ఆమె ప్రకటించారు. ఓ ఎంపీగా తాను ఎవరితోనైనా భేటీ కావొచ్చని, అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని ఆమె తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు తాను తరచూ దూరంగా ఉండటానికి కారణం పార్టీ నేతలే అని విమర్శించారు. తాను పార్టీలో ఉండాలని సొంత పార్టీ నేతలే కోరుకోవడం లేదని శతాబ్ది రాయ్ సంచలన ప్రకటనలు చేశారు. 

Updated Date - 2021-01-16T03:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising