ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా టీవీ షో నుంచి వైదొలిగిన Shashi Tharoor

ABN, First Publish Date - 2021-12-06T16:47:16+05:30

రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శశి థరూర్ సంసద్ టీవీ చర్చా కార్యక్రమం హోస్ట్‌గా వైదొలిగారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శశి థరూర్ సంసద్ టీవీ చర్చా కార్యక్రమం హోస్ట్‌గా వైదొలిగారు.సంసద్ టీవీలో టాక్ షో ‘టు ది పాయింట్’ హోస్ట్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శశి థరూర్ సోమవారం ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు. ‘‘సంసద్ టీవీ షోను హోస్ట్ చేయమనే ఆహ్వానాన్ని అంగీకరించడం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ఉత్తమ సంప్రదాయమని నేను నమ్మాను’’ అని థరూర్ అన్నారు.‘‘అయితే గత సెషన్‌లో చేసిన చర్యలకు ఏకపక్ష పద్ధతిలో రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సుదీర్ఘంగా సస్పెండ్ చేయడం, పార్లమెంటు పనిని చైతన్యవంతం చేసే ద్వైపాక్షిక స్ఫూర్తిని ప్రశ్నార్థకం చేసింది. 


సోమవారం ఉదయం నిరసనకారులకు  నా సంఘీభావాన్ని తెలియజేయడానికి సంసద్ టీవీలో షో హోస్ట్ నుంచి వైదొలుగుతున్నాను’’ అని శశిథరూరర్ చెప్పారు.అంతకుముందు రాజ్యసభలో సస్పెన్షన్ కు గురై 12 మంది ఎంపీలలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా సంసద్ టీవీ షో ‘మేరీ కహానీ’ యాంకర్‌గా తప్పుకున్నారు.


Updated Date - 2021-12-06T16:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising