ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకూ ఆ రక్షణ కావాలి.. కేంద్రాన్ని కోరనున్న Serum Institute

ABN, First Publish Date - 2021-06-03T20:58:28+05:30

టీకా వికటించిన సందర్భాల్లో న్యాయపరమైన చర్యల నుంచి వ్యాక్సిన్ కంపెనీలను రక్షించే ఇండెమ్నిటీ నిబంధన తమకూ వర్తించేలా చేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని కోరనున్నట్టు సమాచరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీకా వికటించిన సందర్భాల్లో న్యాయపరమైన చర్యల నుంచి వ్యాక్సిన్ కంపెనీలను రక్షించే ఇండెమ్నిటీ నిబంధన తమకూ వర్తించేలా చేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని కోరనున్నట్టు సమాచరం. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలనేది ‘సీరం’ అభిప్రాయమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ‘‘విదేశీ కంపెనీలకు ఈ రక్షణ కల్పిస్తే అన్ని టీకా తయారీ సంస్థలకు దీన్ని వర్తింపచేయాలి..ఒక్క ‘సీరం’కు అనే కాదు..’’ అని ఆ వర్గాలు వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియా ప్రచురించింది. ఫైజర్, మోడర్నా వంటి విదేశీ టీకా సంస్థలకు ప్రభుత్వం ఇండెమ్నిటీ రక్షణ కల్పించేందుకు సిద్ధమైందన్న వార్త వెలువడిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 


కాగా.. గతేడాది నవంబర్‌లోనే ‘సీరం’ సంస్థకు టీకా వికటించిందంటూ లీగల్ నోటీసులు అందాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా తన మెదడులో సమస్యలు తలెత్తాయని, ఇందుకు పరిహారంగా సంస్థ తనకు రూ.5 కోట్లు చెల్లించాలని ఓ వ్యక్తి ‘సీరం‌’కు లీగల్ నోటీసులు పంపించారు. అప్పట్లోనే దీనిపై స్పందించిన ‘సీరం’ సీఈఓ అదర్ పూనావాలా..దేశంలో టీకా కార్యక్రమం సాఫీగా అమలవ్వాలంటే ఇండెమ్నిటీ రక్షణ అవసరమని వ్యాఖ్యానించారు. భారత్ బయోటెక్ వర్గాలు కూడా తమకు ఈ రకమైన రక్షణ అవసరమన్న అభిప్రాయాన్ని తమ అంతర్గత సమావేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. భారత్‌కు టీకాలు సరఫరా చేయాలంటే ఇండెమ్నిటీ కావాలంటూ విదేశీ సంస్థలు పట్టుబడుతుండటంతో ఈ అంశానికి ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక..‘సీరం’కు గానీ భారత్ బయోటెక్‌కు గానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ సదుపాయాన్ని కల్పించలేదు. 

Updated Date - 2021-06-03T20:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising