ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్

ABN, First Publish Date - 2021-04-21T18:45:49+05:30

కోవిషీల్డ్ ధరలను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కోవిషీల్డ్ ధరలను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 అని తెలిపింది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది. 


ఉత్పత్తి సామర్థ్యంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, వ్యాక్సినేషన్ సెంటర్లు నేరుగా వ్యాక్సిన్‌ను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు దోహదపడతాయని తెలిపింది. 


రిటెయిల్ వ్యాపారంలో ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం సవాలుతో కూడుకున్నదని వివరించింది. రిటెయిల్, స్వేచ్ఛా విపణిలో ఈ వ్యాక్సిన్ సుమారు నాలుగైదు నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థల ద్వారా వ్యాక్సిన్లను పొందాలని కార్పొరేట్, ప్రైవేటు సంస్థలను కోరింది. 


కోవిషీల్డ్‌ ధరతో ఇతర దేశాల్లోని వ్యాక్సిన్ల ధరలను పోల్చి చెప్తూ, అమెరికన్ వ్యాక్సిన్ల ధర ఒక డోసు సుమారు రూ.1,500 ఉందని తెలిపింది. రష్యా, చైనా వ్యాక్సిన్ల ఒక డోసు ధర రూ.750కి పైనే ఉందని వివరించింది. 




Updated Date - 2021-04-21T18:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising