ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్‌ ఐఏఎస్‌ అభయ్‌ త్రిపాఠి మృతి

ABN, First Publish Date - 2021-12-20T09:30:23+05:30

ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌ మాజీ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అభయ్‌ త్రిపాఠి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌ మాజీ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అభయ్‌ త్రిపాఠి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మరణించారు. ఆయన మరణం పట్ల ఏపీ భవన్‌ అధికారులు, ఉద్యోగులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. త్రిపాఠి మరణం పట్ల ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెండ్‌ కమిషనర్‌ భావనా సక్సేనా, స్పెషల్‌ కమిషనర్‌ ఎన్వీ రమణారెడ్డి, ఇతర అధికారులు సంతాపం తెలిపారు. త్రిపాఠి కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశా రు. అభయ్‌ త్రిపాఠీ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా వివిధ శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆయన 2019 నవంబరు 27న ఢిల్లీలోని ఆంధ్రభవన్‌కు ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. 2021 జూలై 31న పదవీ విరమణ పొందారు. త్రిపాఠి 1961లో పాట్నాలో జన్మించారు. చరిత్రలో పీజీ చేశారు. నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ స్ర్టేటజిక్‌ స్టడీ్‌సలో ఎంఫిల్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో ఐఏఎ్‌సకు 1986లో ఎంపికైన ఆయన... చిత్తూరు సబ్‌ కలెక్టర్‌గా, తుడా వైస్‌చైర్మన్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా, విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా, నిజామాబాద్‌ కలెక్టర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా న్యూఢిల్లీలోనూ, 2001-02లో ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. 


Updated Date - 2021-12-20T09:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising