ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే కన్సెషన్ కోసం Senior citizens ఎదురుచూపులు..

ABN, First Publish Date - 2021-11-01T23:24:35+05:30

కోవిడ్ ముందునాటి రెగ్యులర్ ట్రైన్లతో చూసినప్పుడు అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లతో ఎంపిక చేసిన రైళ్లు సోమవారం నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోవిడ్ ముందునాటి రెగ్యులర్ ట్రైన్లతో చూసినప్పుడు అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లతో ఎంపిక చేసిన రైళ్లు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణను ఇంకా రైల్వేలు చేపట్టలేదు. గత ఏడాది మార్చి 22న రెగ్యులర్ రైళ్ల రాకపోకలను ఆపేసినప్పటి నుంచి సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను సస్పెండ్ చేశారు. చాలా రాష్ట్రాల్లో కోవిడ్ తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ కవరేజ్ పెరగడంతో సదరన్ రైల్వే, ఇతర జోన్లలో కోవిడ్ ముందునాటి 90 శాతం రైళ్లను రైల్వే శాఖ పునరుద్ధరించింది. రిజర్వ్‌డ్ కోచ్‌లతో ఈ రైళ్లు నడుస్తున్నాయి.


ప్రస్తుతం తమిళనాడు, కేరళలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం వేళలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లతో రైళ్లు నడుపుతున్నారు. కోవిడ్ ముందునాటి స్థాయిలో రైళ్లు తిరిగి రాకపోకలు సాగిస్తున్నందున పెద్దవాళ్లకు రాయితీలను కొనసాగించాలని డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్‌యూసీసీ) సభ్యుడు డి.శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాత్రం, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లతో నడుస్తున్న రైళ్లను రిజర్వ్‌డ్ స్పెషల్స్‌గానే పరిగణిస్తున్నందున రాయితీలను అనుమతించడం లేదని చెబుతున్నారు. రాయితీల పునరుద్ధరణపై రైల్వే బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


కాగా, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను పరిరక్షించడం ప్రభుత్వం బాధ్యత అని, రాయితీలను ఉచితంగా భావించరాదని, ఈ విషయంలో జరుగుతున్న జాప్యం ఆమోదయోగ్యం కాదని, విచారకరమని డీఆర్‌యూసీసీ సభ్యులు నైనా మసిల్మాని వ్యాఖ్యానించారు. దీనిపై నాగర్‌కోయిల్ ప్రయాణికుడు ఎడ్వర్డ్ జెనీ మరింత విశ్లేషణ చేస్తూ, రాయితీల వల్ల భారీగా ఆదాయం గండి పడుతుందనుకుంటే కనీసం స్లీపర్ క్లాస్, సెకెండ్ క్లాస్, అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లకు రాయితీలు పునరుద్ధరించే విషయం ఆలోచించాలని, రైల్వేలు విధాన నిర్ణయం తీసుకునేంత వరకూ ఏసీ క్లాస్ ప్రయాణికులను మాత్రం పూర్తి మొత్తం చెల్లించాలని అడగవచ్చని సూచించారు. కన్షిషన్ల పరంగా చూసినప్పుడు సీనియర్ సిటిజన్ల విషయంలో మహిళలు 50 శాతం రాయితీకి, పురుషులు 40 శాతం రాయితీని పొందడానికి అర్హులు. మహిళలకు కనీస వయో పరిమితి 58, పురుషులకు కనీస వయోపరిమితి 60 ఏళ్లుగా ఉంది.

Updated Date - 2021-11-01T23:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising