ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌కు ఝలక్... వచ్చే ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ!

ABN, First Publish Date - 2021-06-18T02:47:50+05:30

శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో సంచలన విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో సంచలన విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన కలిసి పోటీలోకి దిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ ప్రకటన కాంగ్రెస్‌కు శరాఘాతమే. ప్రస్తుతం మహా వికాస్ అగాఢీ పేరుతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను విడిపించుకోవాలన్న మూడ్‌లో ఎన్సీపీ, శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లాలని అనుకుంటోంది. అదే నిజమైతే శివసేన, ఎన్సీపీ కలిసి బరిలోకి దిగుతాయి. ఈ విషయమై శరద్ పవార్, ఉద్ధవ్ ఇప్పటికే మాట్లాడేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నాం’’ అని సామ్నా లో శివసేన పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయని,అయినా ఇప్పుడే అన్ని పార్టీలూ ఎన్నికల గురించి మాట్లాడేస్తున్నాయని అభిప్రాయపడింది. దీనిని బట్టి చూస్తే మధ్యంతర ఎన్నికలను తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోందని శివసేన పేర్కొంది. 

Updated Date - 2021-06-18T02:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising