ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో విడత సంస్థాగత ఎన్నికలపై ఓపీఎస్‌ సమీక్ష

ABN, First Publish Date - 2021-12-20T13:51:15+05:30

అన్నాడీఎంకే రెండో విడత సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లపై ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం పార్టీ నేతలు, ప్రముఖులతో సమీక్షించారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఈనెల మూడున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: అన్నాడీఎంకే రెండో విడత సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లపై ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం పార్టీ నేతలు, ప్రముఖులతో సమీక్షించారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఈనెల మూడున ప్రారంభమైంది. పార్టీ ఉపసమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్తగా పన్నీర్‌సెల్వం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొదటి విడత సంస్థాగత ఎన్నికలు ఈనెల 13న ప్రారంభమై ఇటీవలే ముగిశాయి. ఈ నేపథ్యంలో 40 పార్టీ జిల్లా శాఖలకు సంబంధించిన రెండో విడత సంస్థాగత ఎన్నికలు ఈనెల 22 నుంచి 23 వరకు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఏర్పాట్లపై పన్నీర్‌సెల్వం ఆదివారం ఉదయం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’లో చెన్నై జిల్లాల శాఖల నాయకులతో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి పార్టీ  ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ అధ్యక్షత వహించారు. పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ వచ్చే యేడాది ఫిబ్రవరిలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించేందుకు జిల్లా శాఖ నాయకులు తీవ్రంగా పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి చెన్నై కార్పొరేషన్‌లో సగానికి పైగా వార్డులలో పార్టీ తప్పకుండా విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2021-12-20T13:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising