ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డు బద్దలుకొట్టిన మే నెల వర్షం.. 121 ఏళ్లలో రెండో అత్యధికం

ABN, First Publish Date - 2021-06-12T00:48:25+05:30

ఈ ఏడాది వేసవి ఆఖర్లో వర్షపాతం రికార్డులు బద్దలు కొట్టింది. ముఖ్యంగా మే నెలలో నమోదైన వర్షపాతం దేశంలోనే గత 121 ఏళ్లలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ ఏడాది వేసవిలో వర్షపాతం రికార్డులు బద్దలు కొట్టింది. ముఖ్యంగా మే నెలలో నమోదైన వర్షపాతం దేశంలోనే గత 121 ఏళ్లలో ద్వితీయ అత్యధికంగా నిలిచింది. ఈ మేరకు జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. గత నెలలో నమోదైన వర్షపాతానికి సంబంధించి వాతావరణ శాఖ గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. గత 121 ఏళ్లలో మే నెలలో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే.


 వెంటవెంటనే రెండు తుఫానులు రావడం, వాటితో పాటు పశ్చిమాన ఏర్పడిన వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ స్థాయిలో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ వర్షపాతం కారణంగా  వాతావరణం చలబడిందని, దీంతో మే నెలలో ఉష్ణోగ్రతలు సగటున 34.18 డిగ్రీలుగా నమోదయ్యాయని తెలిపింది. ఈ ఉష్ణోగ్రతల సగటు కూడా 1901 తర్వాత నాలుగో అత్యల్పమని వాతావారణ శాఖ వెల్లడించింది.


కాగా.. మే నెలలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 32.68 డిగ్రీలు. ఇది 1917లో నమోదైంది. అయితే 1977లో 33.84 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, దాని తర్వాత ఇదే అత్యల్పమని వాతావరణ శాఖ తెలిపింది.



Updated Date - 2021-06-12T00:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising