ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాణసంచా నిషేధంపై కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2021-11-02T01:11:02+05:30

రాబోయే పండుగుల సీజన్‌లో పశ్చిమబెంగాల్‌లో బాణసంచా వినియోగంపై నిషేధం విధిస్తూ కోల్‌కతా హైకోర్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాబోయే పండుగుల సీజన్‌లో పశ్చిమబెంగాల్‌లో బాణసంచా వినియోగంపై నిషేధం విధిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదంటూ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలు చేయాలని,  సక్రమ అమలను పర్యవేక్షించేందుకు అవసరమైన యంత్రాగాన్ని పటిష్టం చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల్లో మైనంతో చేసిన దీపాలు, నూనె దీపాలను మాత్రమే వాడాలని, గ్రీన్‌క్రాకర్స్‌తో సహా సుప్రీంకోర్టు, ఎన్జీటీ అనుమతించిన బాణసంచా వాడకాన్ని సైతం నిషేధిస్తున్నామని పేర్కొంది. ఈ ఆదేశాలను ఎఎం ఖాన్విల్కర్, అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక వెకేషన్ బెంచ్ తోసిపుచ్చుతూ, వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే వాటిపై నిషేధం మినహా బాణసంచాపై పూర్తి నిషేధం లేదని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పు చెప్పిందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని, పశ్చిమబెంగాల్ ఇందుకు మినహాయింపు కాదని తెలిపింది. ''ఇదేమీ  కొత్త విషయం కాదు. సుప్రీంకోర్టు ఇప్పటికే దీనిపై ఆదేశాలిచ్చింది. అందరూ ఒకేవిధంగా దీనిని అమలు చేయాలి. సుప్రీం తీర్పే అత్యున్నతం. హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేముందు సంబంధిత పార్టీలను పిలిపించి వారి వాదన విని ఉండాల్సింది'' అని ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2021-11-02T01:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising