ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఖింపూర్‌ ఘటనపై యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం

ABN, First Publish Date - 2021-10-07T19:21:53+05:30

ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల పెద్ద సంఖ్యలో రైతులు మరణించారు. దీనిపై ప్రభుత్వం సరైన విధంగా స్పందిచడం లేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. దీనిపై సరైన చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లఖింపూర్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ దుర్ఘటనకు కారణమైన వారిని ఎంత మందిని గుర్తించారు? ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై తమకు ప్రభుత్వం నుంచి రిపోర్ట్ కావాలని ధర్మాసనం ఆదేశించింది. నలుగురు రైతులు సహా ఎనిమిది చనిపోయిన ఈ ఘటనలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి సుప్రీం ఆరా తీసింది.


‘‘ప్రమాదంలో నలుగురు రైతులు, జర్నలిస్టులు సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు ఎంత జరిగిందో, ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదైందో మాకు చెప్పండి. అంతే కాదు ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు, కేసు వివరాల్ని మాకు ఇవ్వండి’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.


లఖింపూర్ ఘటనపై సుప్రీంలో వేసిన పిటిషన్‌లో ‘‘ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల పెద్ద సంఖ్యలో రైతులు మరణించారు. దీనిపై ప్రభుత్వం సరైన విధంగా స్పందిచడం లేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. దీనిపై సరైన చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారును తోలడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిందీ సంఘటన. ఇది యూపీనే కాకుండా మొత్తం దేశాన్ని కుదిపివేసింది. కేంద్ర మంత్రిపై అతడి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, సున్నిత వాతావరణాన్ని పాడు చేయొద్దని అధికార పక్షం వాదప్రతివాదనలు చేసుకుంటున్నాయి.

Updated Date - 2021-10-07T19:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising