ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళనపై రైతులను ప్రశ్నించిన సుప్రీం

ABN, First Publish Date - 2021-10-05T02:28:36+05:30

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుత ‘సత్యాగ్రహం’ కోసం సుప్రీంలో చేసిన రైతు సంఘాలు పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం ధర్మాసనం సాగు చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన తరువాత మళ్లీ నిరసనలు ఎందుకని ప్రశ్నించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై స్టే ఇచ్చినా ధర్నాలు ఎందుకు చేస్తున్నారంటూ రైతులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుత ‘సత్యాగ్రహం’ కోసం సుప్రీంలో చేసిన రైతు సంఘాలు పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం ధర్మాసనం సాగు చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన తరువాత మళ్లీ నిరసనలు ఎందుకని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టు ముందు ప్రస్తావించారు. కాగా, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవ్వరూ బాధ్యత వహించరని కోర్టు నిరాశ వ్యక్తం చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 21కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2021-10-05T02:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising