ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

umrah permits: కొవిడ్ టీకాలు వేయించుకున్న యాత్రికులకు సౌదీ అనుమతి

ABN, First Publish Date - 2021-07-30T13:52:29+05:30

పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాను సందర్శించే భక్తులకు సౌదీఅరేబియా శుభవార్త వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్కా (సౌదీఅరేబియా): పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాను సందర్శించే భక్తులకు సౌదీఅరేబియా శుభవార్త వెల్లడించింది. రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకున్న విదేశీ భక్తులను ఉమ్రా యాత్రకు అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా సర్కారు శుక్రవారం ప్రకటించింది.కరోనావైరస్ మహమ్మారి కారణంగా 17 నెలల మూసివేత తర్వాత పూర్తిగా టీకాలు వేసిన విదేశీ పర్యాటకులకు తన సరిహద్దులను తిరిగి తెరుస్తున్నట్లు సౌదీ తెలిపింది. యాత్రికులకు వీసాలను ఆగస్టు 1వతేదీ నుంచి ప్రారంభిస్తామని సౌదీ పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. 


సౌదీ సర్కారు ఆమోదించిన ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్  టీకాలు వేయించుకున్న వారు సంస్థాగత దిగ్బంధం లేకుండా మక్కాలోకి ప్రవేశించవచ్చు. యాత్రికులు 72 గంటలలోపు కొవిడ్ ఆర్టీపీసీఆర్ ప్రతికూల పరీక్ష నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.కొవిడ్ వల్ల హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు అంతరాయం వాటిల్లింది.ప్రస్తుతం సౌదీ అరేబియాలో నివసిస్తున్న కొవిడ్ టీకాలు వేయించుకున్న యాత్రికులు కూడా ఉమ్రా అనుమతులకు అర్హులని సర్కారు ప్రకటించింది.


Updated Date - 2021-07-30T13:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising