ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిత సదస్సుకు మోదీని ఆహ్వానించిన సౌదీ అరేబియా

ABN, First Publish Date - 2021-08-01T00:38:33+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనీషియేటివ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనీషియేటివ్ సమ్మిట్‌కు సౌదీ అరేబియా ఆహ్వానించింది. దీంతో వాతావరణ సంబంధిత అంశాల్లో భారత దేశానికిగల ప్రాధాన్యం వెల్లడవుతోంది. వాతావరణ మార్పులపై పోరాటంలో ప్రాంతీయ కృషికి నాయకత్వం వహించాలని సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది. ఈ సదస్సు అక్టోబరులో జరుగుతుంది. 


మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనీషియేటివ్, సౌదీ గ్రీన్ ఇనీషియేటివ్‌లను మార్చిలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. ఈ రెండు సదస్సులు వాతావరణ మార్పులకు సంబంధించిన కృషికి నాంది మాత్రమేనని తెలిపారు. వాతావరణ మార్పులతో పోరాటంలో సౌదీ అరేబియా, ఈ ప్రాంతం, ప్రపంచం మరింత వేగంగా ముందుకెళ్ళాలన్నారు. 


మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనీషియేటివ్‌లో భాగంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ స్టేట్స్‌తోనూ, మిడిల్ ఈస్టర్న్ దేశాలతోనూ కలిసి సౌదీ అరేబియా పని చేస్తుంది. ఈ ప్రాంతంలో 40 బిలియన్ల మొక్కలను నాటాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. క్షీణించిన 200 మిలియన్ హెక్టార్ల భూమికి సమానమైన స్థాయిలో భూమిని ఈ ప్రాజెక్టు పునరుద్ధరిస్తుందని అంచనా వేస్తున్నారు.


Updated Date - 2021-08-01T00:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising