ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కూర్చుంటే నడవదు, మహారాష్ట్రకు రండి : సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2021-04-11T20:27:55+05:30

లాక్‌డౌన్ విధింపును సమర్థిస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌నే శ్రేయస్కరమన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : లాక్‌డౌన్ విధింపును సమర్థిస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌నే శ్రేయస్కరమన్న అభిప్రాయం ప్రపంచమంతా ఉందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ విధించడం మినహా గత్యంతరం లేదన్న సీఎం ఉద్ధవ్ వ్యాఖ్యలు సరైనవని, సమర్థించుకున్నారు. ఇలాంటి పరిస్థితి కేవల మహారాష్ట్రలోనే లేదని, దేశమంతా ఇలాంటి పరిస్థితే ఉందని వివరించారు. కరోనాపై పడుతున్న పోరు భారత్, పాక్ యుద్ధమేమీ కాదని అన్నారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. ఈ సందర్భంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ఫడ్నవీస్ మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు లాక్‌డౌన్‌కు వ్యతిరేకమని చెబుతున్నారు. ఆ విషయం మాకు తెలుసు. మరి ప్రజలు బతకడానికి వేరే దారులున్నాయా? చెప్పండి.’’ అని రౌత్ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో కూర్చొని మాట్లాడవద్దని, మహారాష్ట్రకు వచ్చి చూసి మాట్లాడాలని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన స్వస్థలమూ మహారాష్ట్రయే అని, రాజకీయం చేయడం తగదని రౌత్ హితవు పలికారు. 

Updated Date - 2021-04-11T20:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising