ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని చూసి నేర్చుకోవాలి : కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-05-18T01:13:37+05:30

ప్రదర్శిస్తున్నామని ఎప్పుడూ భావించకూడదన్నారు. బీజేపీ లాగా ఎప్పుడూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి నిరాశావాదం ఏమాత్రం పనికిరాదని, బీజేపీ లాగా ఆలోచిస్తూ, బీజేపీని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఫలితాలను చూసి ఎవరూ కుంగిపోవద్దని, పార్టీ భూమికను కోల్పోకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖుర్షీద్ పై వ్యాఖ్యలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా ఉన్నామని, ఓ రాష్ట్రంలో బలమైన ఉనికిని ప్రదర్శిస్తున్నామని ఎప్పుడూ భావించకూడదన్నారు. బీజేపీ లాగా ఎప్పుడూ బిగ్ స్ట్రాటజీ, తమను తాము పెద్దగా ఊహించుకుంటూనే కార్యక్షేత్రంలో ముందుకు సాగాలని హితవు పలికారు. ‘‘నిరాశా వాదాన్ని మాత్రం దరిచేరకుండా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కేడర్‌ను, రాజకీయంగా కోల్పోయామన్న నిరాశను మాత్రం దగ్గరికి రానీయకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిందే. తదుపరి లక్ష్యం, ఏం చేయాలి అన్న దానిపైనే ధ్యాసనంతా నిలపాలి’’ అని ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. అయితే బెంగాల్, అసోంలో ‘వ్యూహాత్మక ఓటింగ్’ జరిగిందని, అందుకే కాంగ్రెస్, వామపక్షాలు ఓడిపోయాయన్న వాదనను సల్మాన్ ఖుర్షీద్ అంగీకరించారు. 

Updated Date - 2021-05-18T01:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising