ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'సెలవు రోజుల్లో కూడా ఖాతాల్లో వేతనం, పింఛను డబ్బు... ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి

ABN, First Publish Date - 2021-07-24T02:06:49+05:30

ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ వెసులుబాటు కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ వెసులుబాటు కల్పించింది. ఇక మీదట వేతనం, పింఛను డబ్బులు సెలవు రోజుల్లో జమకానున్నాయి. వేతనం, పింఛను  డబ్బులు, ఈఎమ్ఐ చెల్లింపులు చేయడమన్నది ఇప్పటివరకు బ్యాంక్ సెలవు రోజుల్లో వీలు కాకపోయేది. కాగా... కొత్తగా ఆర్‌బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో మార్పుల నేపధ్యంలో... సెలవు రోజుల్లో కూడా వేతనం, పింఛను డబ్బు సంబంధిత వ్యక్తుల  ఖాతాల్లో జమ కానున్నాయి. 


ఈ మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై వేతనాలు, పింఛను, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్Iగ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. అంటే తాజా మార్పుల నేపధ్యంలో... వేతనం లేదా పింఛను  డబ్బుల క్రెడిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ఏసీహెచ్ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం... బ్యాంకులు తెరచి ఉన్నప్పుడు మాత్రమే ఎన్ఏసీహెచ్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి.


కొన్ని సందర్భాల్లో...  నెల మొదటి రోజు వారాంతంలో వస్తుంది. దీని కారణంగా ప్రజలు బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారులకందించే సేవలను మరింత పెంచడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలను 24X7 అందుబాటులో ఉంటాయని 'సూచించారు. 

Updated Date - 2021-07-24T02:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising