ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సైనా’ పోస్టర్‌పై విమర్శలు.. కాస్త ఆలోచించి మాట్లాడండి అన్న డైరెక్టర్!

ABN, First Publish Date - 2021-03-05T00:49:19+05:30

సైనా సినిమా పోస్టర్ విడుదలైన నాటి నుంచి నెటిజన్లను గగ్గోలు పెడుతున్నారు. బ్యాడ్మింటన్ ఆటపై రూపొందిన సినిమాలో టెన్నిస్ ఆట సర్వ చూపించేలా పోస్ట్ డిజైన్ చేశారంటూ ఆభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ వివాదంపై సైనా సినిమా డైరెక్టర్ అమోల్ గుప్తే తాజాగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సైనా సినిమా పోస్టర్ విడుదలైన నాటి నుంచి నెటిజన్లను గగ్గోలు పెడుతున్నారు. బ్యాడ్మింటన్ ఆటపై రూపొందిన సినిమాలో టెన్నిస్ ఆట సర్వ చూపించేలా పోస్ట్ డిజైన్ చేశారంటూ ఆభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విమర్శలపై ‘సైనా’ సినిమా డైరెక్టర్ అమోల్ గుప్తే తాజాగా స్పందించారు. ఆ పోస్ట్‌ర్ అర్థం అది కాదని..ఏదైనా కామెంట్ చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించిన ఆయన..పోస్టర్ డిజైన్ వెనుకున్న అసలు కారణాన్ని వివరించారు. 


‘ఈ పోస్టర్ విషయమై డిజిటల్ మీడియాలో బోలెడన్ని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. అది టెన్నిస్ సర్వ్‌లా ఉందని, సైనా సానియా లాగా చేస్తోందని ఇలా ఏవేవో వ్యాఖ్యలు వినిపించాయి. గాల్లో అంతెత్తున ఉన్నట్టు షటల్ సైనా అనుకుంటే..ఆ దిశగా చేయి చాపుతున్నట్టు ఉన్నది ఓ సాధారణ భారతీయ బాలిక. ఆమె సైనా అంత ఎత్తుకు చేరాలని ప్రయత్నిస్తోంది. ఇదీ ఆ పోస్టర్ వెనుక ఉన్న కాన్సెప్ట్ అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. దాన్ని హైకాన్పెప్ట్ పోస్టర్‌గా ఆయన అభివర్ణించారు. రాహుల్ నందా డిజైన్ వెనుకున్న ఉద్దేశ్యాన్ని దురదృష్టవశాత్తూ మాటల్లో వివరించాల్సి వస్తోంది. అసహనం ఎక్కువైపోతున్న ప్రపంచం.. ఇది చెత్త అని కొట్టేపారేసే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు..! కాస్త ఆలోచించండి’ అని ఆయన కామెంట్ చేశారు. సైనా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి పరినితీ చోప్రా నిటిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-03-05T00:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising