ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయినా సరే, బీజేపీతో కుదరదు: తేల్చి చెప్పిన శిరోమణి

ABN, First Publish Date - 2021-11-20T01:29:16+05:30

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుంచి వైదొలగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) పార్టీ.. తిరిగి బీజేపీతో స్నేహం చేయనని స్పష్టం చేసింది. ఎస్‌ఏడీ ఏ కారణంతో అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుంచి వైదొలగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) పార్టీ.. తిరిగి బీజేపీతో స్నేహం చేయనని స్పష్టం చేసింది. ఎస్‌ఏడీ ఏ కారణంతో అయితే ఎన్డీయే నుంచి వైదొలగిందో ఆ కారణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం స్వస్తి చెప్పారు. గతేడాది ఆగస్టులో తీసుకువచ్చిన వివాదాస్పద నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సాగు చట్టాల కారణంగా బీజేపీ నుంచి దూరమైన ఎస్‌ఏడీ పార్టీ.. తిరిగి కాషాయ పార్టీతో స్నేహం చేస్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తాయి. కాగా, ఇదే విషయాన్ని ఎస్‌ఏడీ అధినేత సుఖ్‌బిర్ సింగ్ బాదల్ వద్ద ప్రస్తావించగా ‘‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ 700 మందికి పైగా రైతులు మరణించారు. ఇంత మంది ప్రాణాలు పోతున్నా ప్రధానమంత్రి పట్టించుకోలేదు. ఈరోజు ఉన్నపళంగా చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఇదేమీ రైతులపై ప్రేమతో చేస్తున్నది కాదు. ముందు పార్లమెంట్‌‌లో దీనిపై చర్చ జరిగి ఆమోదం పొందిన తర్వాత చూద్దాం’’ అని అన్నారు. అయితే సాగు చట్టాలు చట్టబద్ధంగా రద్దైతే బీజేపీతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా.. అలాంటి అవకాశాలు లేవని సుఖ్‌బీర్ సింగ్ తేల్చి చెప్పారు.

Updated Date - 2021-11-20T01:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising