ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Twitterలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్‌లు

ABN, First Publish Date - 2021-11-10T15:20:33+05:30

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లు ఈ ఏడాది ట్విటర్‌లో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల్లో నిలిచినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లు ఈ ఏడాది ట్విటర్‌లో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల్లో నిలిచినట్లు బ్రాండ్‌వాచ్ నిర్వహించిన వార్షిక పరిశోధనలో తేలింది. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో,భారత మాజీ కెప్టెన్ సచిన్ 35వ స్థానంలో నిలిచారు. మోదీ, సచిన్‌లు అమెరికన్ నటులు డ్వేన్ జాన్సన్, లియోనార్డో డి కాప్రియో, యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వంటి వారి కంటే అగ్రస్థానంలో ఉన్నారు.ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ నంబర్ 1 స్థానంలో నిలిచారు.


రెండుసార్లు ప్రధాని పదవిని అధిష్ఠించిన నరేంద్రమోదీ ట్విటర్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో రెండోస్థానంలో నిలవడం విశేషం. సచిన్ టెండూల్కర్ కు దశాబ్దానికి పైగా యునిసెఫ్ తో అనుబంధం ఉంది. 2013లో దక్షిణాసియా అంబాసిడర్ గా నియమితులయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, క్రీడల కార్యక్రమాలకు టెండూల్కర్ మద్దతు ఇచ్చారు.బ్రాండ్‌వాచ్ తమ బ్రాండ్‌ల ఆన్‌లైన్ ఉనికిని విశ్లేషించడానికి కంపెనీలకు సమాచారం అందించడానికి సోషల్ మీడియా డేటాను ఉపయోగిస్తుంది.


Updated Date - 2021-11-10T15:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising