ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ ధరలపై సచిన్ పైలట్ ఫైర్

ABN, First Publish Date - 2021-05-07T01:55:26+05:30

దేశంలో నిర్ణయించిన కొవిడ్ వ్యాక్సిన్ల ధరలపై కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: దేశంలో నిర్ణయించిన కొవిడ్ వ్యాక్సిన్ల ధరలపై కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వ్యాక్సీన్‌కు ఇన్ని ధరలు ఉండకూడదనీ.. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించాలని ఆయన  డిమాండ్ చేశారు. ఇవాళ తన సొంత నియోజక వర్గం టోంక్‌లో పర్యటించిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో పైలట్ మాట్లాడారు. ‘‘సిమెంట్, స్టీల్, విమానాల ధరలను నియంత్రించ గలిగినప్పుడు... ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్ ధరలను ఎందుకు నియంత్రించలేరు? ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా వేయాలి..’’ అని ఆయన పేర్కొన్నారు. ఒకే వ్యాక్సీన్‌కు వేర్వేరు ధరలు నిర్ణయించడంతో ఏమాత్రం ‘‘హేతుబద్ధత లేదని’’ పైలట్ అన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్‌కు బదులు తయారీ కంపెనీలు వేరే మందులపై లాభాలను ఆర్జించాలని ఆయన సూచించారు. ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత వేధిస్తోందనీ.. ఆక్సిజన్ కేటాయింపులపై ప్రభుత్వం ఓ పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-05-07T01:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising