17న తెరుచుకోనున్న శబరిమల ఆలయం
ABN, First Publish Date - 2021-07-11T08:33:12+05:30
మాస పూజల నేపథ్యంలో కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈ నెల 17 నుంచి 5 రోజుల పాటు తెరవనున్నారు.
పథనంథిట్ట, జూలై 10: మాస పూజల నేపథ్యంలో కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈ నెల 17 నుంచి 5 రోజుల పాటు తెరవనున్నారు. ఈ రోజుల్లో దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 5 వేలమంది భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఇందుకోసం భక్తులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. టీకా రెండు డోసులు తీసుకున్న ధ్రువపత్రం, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ (పరీక్ష వ్యవధి 48 గంటల వ్యవధికి మించని) తప్పనిసరి అని స్పష్టం చేసింది. కాగా, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు వినియోగంలో ఉన్న మొబైల్ నంబరు, ఈ మెయిల్ ఐడీని కలిగి ఉండాలి.
Updated Date - 2021-07-11T08:33:12+05:30 IST