ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వెస్ట్ నైల్’వైరస్’ విజృంభిస్తోంది.. జాగ్రత్త: హెచ్చరించిన రష్యా

ABN, First Publish Date - 2021-08-31T02:12:03+05:30

ఈ శరత్ కాలంలో ‘వెస్ట్ నైల్ వైరస్’ (డబ్ల్యూఎన్‌వీ) విజృంభించే అవకాశం ఉందని రష్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఈ శరత్ కాలంలో ‘వెస్ట్ నైల్ వైరస్’ (డబ్ల్యూఎన్‌వీ) విజృంభించే అవకాశం ఉందని రష్యా హెచ్చరించింది. తేలికపాటి ఉష్ణోగ్రతలు, భారీ అవపాత పరిస్థితులు వైరస్‌ను మోసేందుకు దోమలకు అనువుగా మారతాయని పేర్కొంది. ఆఫ్రికాలో పుట్టిన ఈ వైరస్ ఆ తర్వాత యూరప్‌, ఆసియా, ఉత్తర అమెరికాలకు వ్యాపించింది. ఈ దోమలు కుడితే దాదాపు 20 శాతం మందిలో వెస్ట్ నైల్ జ్వరం వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


దోమల ద్వారా పక్షుల నుంచి మనుషులకు ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన నరాల సంబంధ వ్యాధుల బారినపడతారు. డబ్ల్యూఎన్‌వీ సంక్రమించినప్పటికీ అనారోగ్యం అనిపించదు. ప్రతి ఐదుగురిలో ఒకరిలో జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ను అదుపులో పెట్టేందుకు కూడా ఎలాంటి టీకాలు కానీ, మందులు కానీ లేవు. రష్యాలో వెలుగు చూస్తున్న వెస్ట్‌నైల్ జ్వరాల్లో 80 శాతానికిపైగా కేసులు నైరుతి ప్రాంతంలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2021-08-31T02:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising