ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పుత్నిక్-వితో ఒమైక్రాన్ పరార్ : రష్యా

ABN, First Publish Date - 2021-12-18T01:59:12+05:30

ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ పలు దేశాలు క్రమంగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ పలు దేశాలు క్రమంగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఆరు ఖండాల్లో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇక భారతదేశంలోనూ ఈ వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీ మార్కు దాటేసింది. ఈ నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. తొలినాళ్లలో వెలుగుచూసిన కరోనా వైరస్ కోసం తాము అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ ఈ నయా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ప్రకటించింది.


ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇతర టీకాలతో పోలిస్తే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఒమైక్రాన్ వేరియంట్‌పై మూడు నుంచి ఏడు రెట్లు మెరుగ్గా పనిచేసింది. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించిన అభివృద్ధి చేసిన టీకాల కంటే కూడా ప్రభావవంతంగా పనిచేసింది. అదే సమయంలో ‘స్పుత్నిక్ లైట్’ టీకా 80 శాతం సమర్థంగా పనిచేసినట్టు ఈ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన గమలేయ సెంటర్ పేర్కొంది. స్పుత్నిక్ లైట్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవడం ద్వారా ఒమైక్రాన్‌ను అణచివేయవచ్చని వివరించింది.   

Updated Date - 2021-12-18T01:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising