ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలతో పారిపోయిన అఫ్ఘాన్ అధ్యక్షుడు!

ABN, First Publish Date - 2021-08-17T00:50:41+05:30

అఫ్ఘాన్ అధ్యక్షుడు..తన వెంట నాలుగు కార్లు, పెద్ద హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలు తీసుకుని దేశం నుంచి పారిపోయారని ప్రచురించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: తాలిబన్ల దయాదాక్షిణ్యాలకు తమను వదిలేసి దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. అయితే..రక్తపాతం నివారించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అష్రాఫ్ ఘనీ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ రష్యా వార్తా సంస్థ తాజాగా సంచలన విషయాన్ని ప్రచురించింది. అఫ్ఘాన్ అధ్యక్షుడు..తన వెంట నాలుగు కార్లు, పెద్ద హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలు తీసుకుని దేశం నుంచి పారిపోయారని ప్రచురించింది. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాల్ని వెల్లడించినట్టు పేర్కొంది. హెలికాఫ్టర్‌లో జాగా సరిపోకపోవడంతో కొంత డబ్బును అఫ్ఘానిస్థాన్‌లోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని కూడా పేర్కొంది. కాగా..అఫ్ఘానిస్థాన్‌లో ప్రజస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం లేకపోయినప్పటికీ అక్కడ మరికొంత కాలం పాటు పరిమిత స్థాయిలో దౌత్యసిబ్బందిని కొనసాగించేందుకు రష్యా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే..అఫ్ఘాన్ పాలకులుగా తాలిబన్లను ఇప్పుడే గుర్తించాల్సిన అవసరం లేదనేది రష్యా అభిప్రాయమని సమాచారం. 

Updated Date - 2021-08-17T00:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising