ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

International Space Station: కొద్దిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2021-07-30T22:17:54+05:30

గతవారం కజకిస్తాన్‌లోని బైకనూర్ నుంచి 23 టన్నుల బరువు గల ‘నాకా’ అనే మాడ్యూల్‌ను రష్యా పంపించింది. అయితే ఇది ఐఎస్ఎస్‌కు అనుసంధానమైన రెండు గంటల తర్వాత నాకాపై ఉన్న థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో అంతరిక్ష దిశ తప్పి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిలో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని అంతరిక్ష కేంద్రం నాసా ప్రకటించింది. రష్యాకు చెందిన నౌకా మాడ్యూల్‌ కేంద్రానికి అనుసంధానమైన కొన్ని గంటల్లోనే అందులోని థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో కొద్ది సమయం ఐఎస్ఎస్‌పై నియంత్రణ కోల్పోయినట్లు నాసా తెలిపింది. అయితే, భూమిపై నుంచి ఐఎస్ఎస్ కదలికల్ని నిరంతరం పర్యవేక్షించే ‘గ్రౌండ్ కంట్రోల్ సిస్టం’ బృందం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ప్రమాదం జరగకుండా నివారించగలిగింది.


గతవారం కజకిస్తాన్‌లోని బైకనూర్ నుంచి 23 టన్నుల బరువు గల ‘నాకా’ అనే మాడ్యూల్‌ను రష్యా పంపించింది. అయితే ఇది ఐఎస్ఎస్‌కు అనుసంధానమైన రెండు గంటల తర్వాత నాకాపై ఉన్న థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో అంతరిక్ష దిశ తప్పి 45 డిగ్రీలు అదనంగా వంగింది. అప్పటికే అప్రమత్తమైన అమెరికా, రష్యా గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. ఒక గంట వ్యవధిలో ఐఎస్ఎస్ తిరిగి నిర్దేశిత స్థితికి చేరుకుంది. అంతరాయం సమయంలో సిబ్బందితో కమ్యూనికేషన్ రెండుసార్లు అనేక నిమిషాలపాటు కోల్పోయినట్లు, సిబ్బందికి ఏ సమయంలోనూ ప్రమాదం జరగలేదని నాసా తెలిపింది.

Updated Date - 2021-07-30T22:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising