ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చచ్చాడనుకున్న అల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు...

ABN, First Publish Date - 2021-09-12T19:10:31+05:30

అల్ ఖైదా... ఒకప్పుడు ఈ పేరు ఉగ్రవాదానికి మారుపేరుగా మార్మోగింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఒకవైపు తాలిబన్, మరో వైపు ఐసిస్ పోటీపడి విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. మరి, అమెరికాలోని ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11 దాడులతో ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా ప్రస్తుత పరిస్థితి ఏంటి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్ ఖైదా... ఒకప్పుడు ఈ పేరు ఉగ్రవాదానికి మారుపేరుగా మార్మోగింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఒకవైపు తాలిబన్, మరో వైపు ఐసిస్ పోటీపడి విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. మరి, అమెరికాలోని ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11 దాడులతో ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా ప్రస్తుత పరిస్థితి ఏంటి? అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆ సంస్థ నాయకులు తల దాచుకున్నారని అమెరికా నిఘా విభాగాలు భావిస్తున్నాయి. అంతే కాదు, ఆ మధ్య అల్ ఖైదా ప్రస్తుత ప్రధాన నాయకుడు అల్ జవహరీ మరణించాడని కూడా ప్రచారం జరిగింది. కానీ, సెప్టెంబర్ 11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా... చచ్చాడనుకున్న అల్ ఖైదా చీఫ్ తిరిగి కెమెరా ముందుకొచ్చాడు. గంట నిడివి గల వీడియోలో పలు అంశాల గురించి మాట్లాడాడు...

అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తరువాత ఈజీప్టుకు చెందిన అయ్మాన్ అల్ జవహరీ ఉగ్రవాద సంస్థకి నాయకుడయ్యాడు. కానీ, ఒకప్పటిలా ప్రపంచాన్ని గడగడలాడించలేకపోయింది అల్ ఖైదా. ఇక కొన్నాళ్ల క్రితం వయసు రిత్యా వచ్చిన అనారోగ్యల కారణంగా జవహరీ తుది శ్వాస విడిచాడని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్ని తప్పని నిరూపించేలా ఇప్పుడు అల్ ఖైదా చీఫ్ ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. 60 నిమిషాల పాటూ సాగిన ఆయన ప్రసంగం ఎప్పటిలాగే అమెరికాకి వ్యతిరేకంగా నడిచింది. నైన్ బై లెవన్ అటాక్స్ గురించి కూడా మాట్లాడాడు. అఫ్గనిస్తాన్ నుంచీ అగ్ర రాజ్యం సేనల్ని ఉఫ సంహరించటంపై కూడా స్పందించాడు. అయితే, తాలిబన్లు అఫ్గాన్ ని స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే జవహరి వ్యవహారంలో కొత్త అనుమానాలకి తావిస్తోంది. 

అమెరికా తన సైన్యాన్ని అఫ్గాన్ నుంచీ ఉప సంహరించటం కొన్ని నెలల క్రితమే తీసుకున్న నిర్ణయం. కాబట్టి అల్ జవహరి అప్పట్లోనే వీడియో సందేశం రికార్డ్ చేసి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయానికి ఆయన బతికి ఉన్నాడా లేదా అన్నది ఇంకా అనుమానమే. మరో వైపు, అల్ ఖైదా చీఫ్ ఒకవేళ సజీవంగా ఉన్నా కూడా వ్యూహాలు పన్నటంలో అతడి పాత్ర ఇప్పుడు పెద్దగా ఉండకపోవచ్చని ఐక్య రాజ్య సమితి అంచనా వేస్తోంది. ముసలి వాడు కావటమే ఇందుకు కారణమని నిఘా విభాగాల నిపుణులు అంటున్నారు.       

   

Updated Date - 2021-09-12T19:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising