ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ నుంచి కోలుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

ABN, First Publish Date - 2021-04-16T22:48:24+05:30

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌ కొవిడ్-19 నుంచి కోలుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌ కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో ఆయనను ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు నాగ్‌పూర్‌లోని కింగ్స్ వే ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు ఆస్పత్రి మెడికల్ సేవల డైరెక్టర్ సుబ్రజిత్ దాస్ గుప్త ఇవాళ ఓ మెడికల్ బులిటిన్‌లో పేర్కొన్నారు. ‘‘మోహన్ భగవత్ జీ ఆస్పత్రిలో చేరి నేటికి ఎనిమిది రోజులు అవుతోంది. రక్తపోటు, నాడి, శ్వాస, ఆక్సిజనేషన్ సహా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. రక్తపరీక్షల్లో కూడా అన్నీ సాధారణంగానే ఉండడంతో వైద్యులు ఇవాళ ఆయనను డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం ఆయనను పరీక్షించిన డాక్టర్ రాజన్ బారోకర్, ఆయన బృందం కూడా ఆయన పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేశారు..’’ అని దాస్ పేర్కొన్నారు. అయితే డిశ్చార్జ్ అనంతరం ఐదు రోజుల పాటు తన నివాసంలోనే క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆయనకు చికిత్స అందించిన వైద్యుల బృందం పేర్కొన్నట్టు దాస్ తెలిపారు. ఈ నెల 9న మోహన్ భగవత్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-04-16T22:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising