ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీల నివాసాలపై సీసీబీ దాడులు

ABN, First Publish Date - 2021-07-24T18:06:58+05:30

నగరంలో రౌడీల నివాసాలపై సీసీబీ పోలీసులు శుక్రవారం మెరుపుదాడులను నిర్వహించారు. సంఘవిద్రోహ కార్యక పాల్లో పాల్గొంటే సహించేది లేదని హెచ్చరించారు. సీసీబీ జాయింట్‌ కమిషనర్‌ సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: నగరంలో రౌడీల నివాసాలపై సీసీబీ పోలీసులు శుక్రవారం మెరుపుదాడులను నిర్వహించారు. సంఘవిద్రోహ కార్యక పాల్లో పాల్గొంటే సహించేది లేదని హెచ్చరించారు. సీసీబీ జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ నాయత్వంలో తెల్లవారుజాము 4 గంటలకే ప్రారంభమైన దాడులు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. నగరంలోని మొత్తం 8 విభాగాల్లోనూ దాడులు జరిపి రౌడీలను హెచ్చరించినట్లు సీసీబీ పోలీసులు వెల్లడించారు. పేరు మోసిన రౌడీలు సైకిల్‌ రవి, సైలెంట్‌ సునీల, మారేన హళ్ళి జగ్గల, జేసీబీ నారాయణ్‌తో పాటు పలు మాజీ రౌడీల నివాసాలలో తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు సెంట్రల్‌ విభాగంలోని విల్సన్‌ గార్డెన్‌, శాంతినగర, సంపంగిరామనగర, శివాజినగర్‌ ప్రాంతాల్లో జరిగిన దాడుల సందర్భంగా మారణాయుధాలు, గాంజా, పెద్ద పెట్టున ఆధార్‌ కార్డులు లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న కూడా సీసీబీ పోలీసులు నగరంలో పలు చోట్ల మాజీ రౌడీల నివాసాలపై దాడులు జరిగిన సంగతి విదితమే. శివాజీనగర్‌లోని మాజీ రౌడీ షహనాజ్‌ నివాసంలో 254 ఆధార్‌కార్డులు లభించడం కుతూహలం రేకెత్తిస్తోంది. ఈ ఆధార్‌ కార్డులను ఎందుకు సేకరించి పెట్టుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీసీబీ వర్గాలు వెల్లడించాయి. 


Updated Date - 2021-07-24T18:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising