ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహజీవనంలో శృంగారం.. అత్యాచారమా?

ABN, First Publish Date - 2021-03-02T07:20:39+05:30

‘‘ఓ జంట కలిసి బతికారు. భర్త క్రూరుడే అనుకుందాం. అయితే శృంగారంలో పాల్గొనడాన్ని అత్యాచారం అంటారా?’’ అని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రశ్నించారు. అత్యాచార ఆరోపణల కేసు విచారణ సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేప్‌ ఆరోపణల కేసు విచారణలో సీజేఐ ప్రశ్న


న్యూఢిల్లీ, మార్చి 1: ‘‘ఓ జంట కలిసి బతికారు. భర్త క్రూరుడే అనుకుందాం. అయితే శృంగారంలో పాల్గొనడాన్ని అత్యాచారం అంటారా?’’ అని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రశ్నించారు. అత్యాచార ఆరోపణల కేసు విచారణ సందర్భంగా సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ.. తనను పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి, సహజీవనం చేశాడని తనపై అత్యాచారం చేశాడని ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. ఫిర్యాదులో పేర్కొ న్న ప్రకారం.. నిందితుడు, బాధితురాలు రెండేళ్లకు పైగా సహజీవనం చేశారు. అయితే ఆ మహిళ పెళ్ల య్యే వరకు శృంగారానికి ఒప్పుకోనని చెప్పింది. అనంతరం మనాలిలోని ఓ ఆలయంలో నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఇది నిజం కాదని బాధితుడు న్యాయస్థానానికి తెలిపాడు. ఆమె సమ్మతితోనే సహజీవ నం చేసినట్లు వెల్లడించాడు.


ఆలయంలో జరిగిన పెళ్లి నిజమైనదని నమ్మడం వల్లే ఆమె శృంగారానికి అంగీకరించిందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఆమె ను మోసం చేశాడన్నారు. స్పందించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘పెళ్లి విషయంలో మోసపూరిత హామీ ఇవ్వడం తప్పు. ఎవరూ అలా చేయకూడదు. కానీ, సహజీవనం చేసి, శృంగారంలో పాల్గొనడాన్ని రేప్‌ అని ఎలా చెబుతారు?’’ అని వ్యాఖ్యానించింది. ఈ విషయమై గతంలోనే స్పష్టమైన తీర్పులు ఇచ్చామని గుర్తుచేసింది. అయితే నిందితుడు శారీరకంగా హింసించాడని, రహస్య భాగాల్లో గాయాలవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని మహిళ తరఫు న్యాయవాది తెలిపారు. ఆమె కాలు కూడా విరగ్గొట్టాడని చెప్పారు. స్పందించిన సీజేఐ.. ‘‘అప్పుడు మీరు దాడి, గృహ హింస కేసు పెట్టాలి. అత్యాచార కేసు ఎందుకు పెట్టారు?’’ అని ప్రశ్నించారు. వివాహ బంధంతో కలిసి జీవిస్తున్న సమయంలో జరిగిన దాడిని అత్యాచారంగా పరిగణిస్తారా? అని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిని నాలుగు వారాల పాటు అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న నిందితుడి అభ్యర్థనను తిరస్కరించింది. 

Updated Date - 2021-03-02T07:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising