‘రోహిణి పై హక్కుల ఉల్లంఘన తీర్మానానికి అనుమతించండి’
ABN, First Publish Date - 2021-06-27T15:49:36+05:30
మైసూరు జిల్లా మాజీ అధికారి రోహిణి సింధూరిపై శాసనసభలో హ క్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని జేడీఎస్ ఎమ్మెల్యే సా రా మహేశ్ స్పీకర్‌కు శనివారం లేఖ
- స్పీకర్‌కు జేడీఎస్ ఎమ్మెల్యే సా రా మహేశ్ వినతి
బెంగళూరు: మైసూరు జిల్లా మాజీ అధికారి రోహిణి సింధూరిపై శాసనసభలో హ క్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని జేడీఎస్ ఎమ్మెల్యే సా రా మహేశ్ స్పీకర్‌కు శనివారం లేఖరాశారు. తనపై తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించిన మాజీ జిల్లా అధికారిపై హక్కుల ఉల్లంఘనకు తీర్మానానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. రోహిణి సింధూరి సా రా కల్యాణ మండపం రాజకాలువపై నిర్మించారని, గోమాళ భూములను ఆక్రమించారని తనపై నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. ఈ మేరకు ప్రాంతీయ కమిషనర్ బృందం విచారణ చేపట్టి క్లీన్‌చిట్ ఇచ్చిందన్నారు. ప్రాంతీయ కమిషనర్‌లకు లేఖ రాయడం ద్వారా తన పరువుకు భంగం కలిగిందని, రానున్న శాసనసభ సమావేశాల్లో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించాలని సంబంధిత ఆధారాలను స్పీకర్‌కు పంపారు.
Updated Date - 2021-06-27T15:49:36+05:30 IST