కరోనా టీకా: ఒక డోసుతో 92 శాతం, రెండు డోసులతో 98 శాతం ప్రాణ రక్షణ!
ABN, First Publish Date - 2021-07-03T14:12:05+05:30
కరోనాపై పోరాటంలో భాగంగా వేస్తున్న...
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భాగంగా వేస్తున్న టీకాల ఫలితాలు వెల్లడవుతున్నాయి. పీజీఐ చంఢీగఢ్ టీకాల ఫలితాలపై నిర్వహించిన అధ్యయనంలో ఆశ్చర్యకర ఫలితాలు వెలుగు చూశాయి. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నవారికి కరోనా వచ్చినప్పటికీ, 98 శాతం మేరకు ప్రాణహాని తప్పుతుందని. అదే ఒక డోసు తీసుకుంటే 92 శాతం మేరకు ప్రాణహాని ఉండదని వెల్లడయ్యింది.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మీడియాకు... పీజీఐ చంఢీగఢ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన ఫలితాలను వెల్లడించారు. ఈ అధ్యయనం పారదర్శకంగా జరిగిందని, టీకాలు తీసుకున్న పంజాబ్ పోలీసులపై ఈ అధ్యయనం చేపట్టారన్నారు. పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన 4,868 పోలీసులు టీకాలు తీసుకోలేదు. వీరికి కరోనా సోకగా, వీరిలోని 15 మంది మృతి చెందారు. దీని ప్రకారం డెత్ రేటు 3.08గా నమోదయ్యింది. 35,856 మంది పంజాబ్ సోలీసులు ఒక డోసు టీకా తీసుకున్నారు. వీరికి కరోనా సోకగా, 9 మంది మృతి చెందారు. ఇక్కడ డెత్ రేటు 0.25గా ఉంది. ఇక 42,720 మంది పంజాబ్ పోలీసులు రెండు డోసులు టీకా తీసుకోగా, వీరికి కరోనా సోకగా కేవలం ఇద్దరు మాత్రమే మృత్యువాత పడ్డారు. దీని ప్రకారం డెత్ రేటు 0.05 శాతంగా ఉన్నట్లు తేలింది.
Updated Date - 2021-07-03T14:12:05+05:30 IST