ఇంధనాల ధరల్లో మళ్లీ పెరుగుదల
ABN, First Publish Date - 2021-10-21T08:13:03+05:30
రెండు రోజుల విరామం తర్వాత ఇంధనాల ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బుధవారం చమురు కంపెనీలు..
న్యూఢిల్లీ, అక్టోబరు 20: రెండు రోజుల విరామం తర్వాత ఇంధనాల ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బుధవారం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.19కి, ముంబైలో రూ.112.11కి పెరిగింది. ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.102.89, ఢిల్లీలో రూ.94.92గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.110.46 ఉండగా.. డీజిల్ ధర రూ.103.56 స్థాయిలో ఉంది.
Updated Date - 2021-10-21T08:13:03+05:30 IST