ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమీతుమీకి సిద్ధమంటున్న టికాయత్

ABN, First Publish Date - 2021-11-01T22:03:49+05:30

వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఈనెల 26వ తేదీలోగా రద్దు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఈనెల 26వ తేదీలోగా రద్దు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ సోమవారంనాడు డిమాండ్ చేశారు. లేకుంటే 27వ తేదీ నుంచి రైతుల ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తన ట్వట్టర్ అకౌంట్‌లో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ, 27వ తేదీ నుంచి గ్రామాల నుంచి రైతులు ట్రాక్టర్లలో బయలుదేరి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన జరుపుతున్న ప్రాంతాలకు చేరుకుంటారని, అక్కడ వేసుకున్న టెంట్లను కట్టుదిట్టం చేస్తారని చెప్పారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రి, ఘాజిపూర్‌లో రైతులు నిరసన ప్రారంభించి ఈనెల 26వ తేదీకి సరిగ్గా ఏడాది అవుతుంది.


సాగు చట్టాల వల్ల కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుర్గతి తమకు పడుతుందని రైతులు గట్టిగా చెబుతుండగా, ఇవి రైతు అనుకూల చట్టాలని కేంద్రం వాదిస్తోంది. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య 11 విడతలు చర్చలు జరిగినా ప్రతిష్టంభన తొలగలేదు. కాగా, టికాయత్ ఆదివారం సైతం రైతుల ఆందోళనపై మరింత దృఢ వైఖరి ప్రదర్శించారు. నిరసనలు తెలుపుతున్న రైతులను  బలవంతంగా సరహద్దుల నుంచి తొలగిస్తే ప్రభుత్వ కార్యాలయాలనే ధాన్యం మార్కెట్లుగా మార్చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-11-01T22:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising