ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే శశికళ విడుదల!

ABN, First Publish Date - 2021-01-27T06:55:45+05:30

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్రమాస్తుల కేసులో పూర్తయిన జైలుశిక్ష

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నారన్న వైద్యులు


బెంగళూరు, జనవరి 26: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు అధికారుల సమాచారం మేరకు జైలు శిక్ష పూర్తయింది. అయితే, కరోనా బారిన పడిన శశికళ ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున, ఆమె విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీలన్నీ ఆస్పత్రి వద్దే పూర్తి చేయనున్నట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఆమె కరోనా నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆస్పత్రి నుంచి ఆమెను ఎప్పుడు ఇంటికి పంపిస్తారో ఇంకా స్పష్టత లేదు. వైద్యులను సంప్రదించిన తర్వాత ఆమె ఎప్పుడు ఇంటికి వస్తారో వెల్లడిస్తామని ఆమె మేనల్లుడు, అమ్మ మక్కల్‌ మున్నేత్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ చెప్పారు. కాగా, కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం పది రోజులు ఆస్పత్రిలో ఉండాలని విక్టోరియా ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. కాగా, శశికళ బంధువు ఇళవరసి ఫిబ్రవరి మొదటి వారంలో జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె కూడా కరోనా బారిన పడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-01-27T06:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising